- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PACS : పీఏసీఎస్ చైర్మన్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధం..!
దిశ, పర్వతగిరి : పర్వతగిరి మండలం చౌటపల్లి పీఎసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్, వైస్ చైర్మన్ మధుసూదన్ రావుల పై పది మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం కోసం డీసీవోకు ఫిర్యాదు చేశారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. గత ఖరీఫ్, రబీ సీజన్లో వరి ధాన్యం కొనుగోలులో జరిగిన లావాదేవీల విషయంలో, పీఏసీఎస్ భవన నిర్మాణం ప్రహరీ నిర్మాణం గోదాముల నిర్మాణం, రైతులకు ఇచ్చే రుణాల విషయంలో ఒక్కొక్క రైతు వద్ద మూడు వేల నుండి ఐదు వేల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని, పాలకవర్గానికి తెలియకుండా సొంతంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పాలకవర్గాన్ని నిర్వీర్యం చేస్తూ పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగం చేశారని సోషల్ మీడియాలో వచ్చిన సందేశ సారాంశం.
అవిశ్వాస తీర్మానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సొసైటీలో పలు అక్రమాలు జరిగాయని, వాటి పై సరైన లెక్కలు చూపించకపోవడంతో ఈ కారణంతోనే ప్రాథమిక సహకార చట్టం 1964 ప్రకారం మెజారిటీ సభ్యులు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్లు, చైర్మన్ వైస్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానం డీసీఓ నీరజకు తెలిపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20న అవిశ్వాస తీర్మానం పై మీటింగ్ ఏర్పాటు చేసి, చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లు అందరికీ నోటీసులు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కాగా, సంబంధిత అధికారులను చరవాణి ద్వారా సంప్రదించగా సరైన సమాధానం తెలపకపోవడం గమనార్హం. మండలంలోని పర్వతగిరి ప్రెస్ క్లబ్, వివిధ సోషల్ మీడియాలో వచ్చిన సందేశాన్ని క్షణాల్లో డిలీట్ చేయడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.