ఎంపీడీవో, గ్రామ కార్యదర్శుల బదిలీల్లో రాజకీయం..?

by S Gopi |
ఎంపీడీవో, గ్రామ కార్యదర్శుల బదిలీల్లో రాజకీయం..?
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏం మండలంలో బదిలీలు కాకుండా కేవలం కాటారం సబ్ డివిజన్ పరిధిలో బదిలీలు జరగడం వెనక రాజకీయ హస్తం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లాలో జనవరి నెలలో జరిగిన తహశీల్దార్ బదిలీలు ఇదే కోణంలో జరిగాయని జిల్లా ప్రజాప్రతినిధి జోక్యంతోటే బదిలీలు జరిగాయి అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్ మండలాల ఎంపీడీవోల, కాటారం, ప్రతాపగిరి, ధన్వాడ గ్రామ కార్యదర్శుల బదిలీలు జిల్లాలో ఎక్కడ జరగకుండా ఈ కాటారం మండలంలోని చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీడీవోలు సక్రమంగా విధులు నిర్వహిస్తున్న ఈ పరిస్థితుల్లో అకస్మాత్తుగా డిప్యూటేషన్ రద్దు చేసి బదిలీలు చేయడం, పటారం మండలంలోని గ్రామ కార్యదర్శిలపై ఎలాంటి ఫిర్యాదులు లేకుండా విధులు సక్రమంగా నిర్వహిస్తూ గ్రామంలో టాక్స్ వసూలు చేయడం అన్ని రంగాల్లో పెర్ఫార్మన్స్ ఉన్నప్పటికీ బదిలీలు చేయడంలో ఆంతర్యం ఏమిటని బుధవారం జరిగిన కాటారం మండల సర్వసభ్య సమావేశంలో సైతం ప్రజాప్రతినిధులు ఆక్షేపణ తెలిపారు.

రాజకీయ దృక్పథంతోనే ఈ బదిలీలు చేస్తున్నారని కాటారం మండలంలో కాంగ్రెస్ కు ఉన్న ప్రాబల్యంతోపాటు మండలంలో జరుగుతున్న అభివృద్ధి లేకనే అక్కసుతో బదిలీలు చేయించారని, ఇప్పటివరకు బదిలీల్లో రాజకీయ జోక్యం లేదని ఇప్పుడు రాజకీయ నాయకులు తమ పెత్తనం చెలాయించాలని చూస్తే తాము రాజకీయం చేస్తామని ప్రజాప్రతినిధులు పేర్కొనడం ఈ ప్రాంతంలో తీవ్ర చేర్చనీయాంశం అవుతోంది. మండలంలో ప్రతాపగిరి గుట్టపై జరిగిన జాతరకు ప్రజలకు మంచినీటి సౌకర్యంకై కనీసం బోరు వేయించలేదని, లక్ష్మిపూర్, విలాసాగర్, దామరకుంట గ్రామాల ప్రజలు ధాన్యం విక్రయించుకుని డబ్బులు రాక అరిగోస పడుతుంటే రైతుల సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు బదిలీలపై దృష్టి సారించారని ఎంపీపీ కొంతకాని సమ్మయ్య తీవ్రంగా విమర్శించారు. ఆ గ్రామాలలో కార్యదర్శిలపై ఎలాంటి ఫిర్యాదులు లేనప్పటికీ మంచిగా విధిని నిర్వహిస్తున్న వారిని అకస్మాత్తుగా బదిలీ చేయడం పట్ల కాటారం, ధన్వాడ, చిద్నేపెళ్లి ఎంపీటీసీలు తోట జనార్ధన్, బోడ మమత, రవీందర్రావులు అధికారుల తీరును నిరసించారు. ఈ బదిలీలను రద్దు చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed