రూ. 5 లక్షలిస్తే అరెస్ట్ చేయం.. ఏసీబీ పేరుతో రెవెన్యూ ఉద్యోగికి టోకరా..

by Aamani |
రూ. 5 లక్షలిస్తే అరెస్ట్ చేయం.. ఏసీబీ పేరుతో రెవెన్యూ ఉద్యోగికి టోకరా..
X

దిశ, కొత్తగూడ: ఏసీబీ అధికారిని, హైదరాబాద్‌ హెడ్‌ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ రెవెన్యూ శాఖ అధికారిని బురిడీ కొట్టించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ తహశీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. కొత్తగూడ మండల తహశీల్దార్ రమాదేవికి 09611184583, 07259011291 నంబర్లు నుండి ఏసీబీ అధికారులం అంటూ కాల్ చేశారు. కార్యాలయంలో ఎందరు పని చేస్తున్నారు, సీనియర్లు ఎవరు అంటూ ఆరా తీశారు. ఈ క్రమంలో ఆర్ ఐ పరమేశ్వర్ పేరు చెప్పడంతో కాన్ఫరెన్సు తీసుకోవాలని సూచించడంతో తీసుకున్నారు. ఇదిలా ఉండగా కాల్ కట్ అయిన అనంతరం ఆర్ ఐ కి కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు.

మీ ఇంటి ముందు ఏసీబీ అధికారులు ఉన్నారని, అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న అతని భార్య ఫోన్ మాట్లాడగా రూ.5 లక్షలు ఇస్తే వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారు. తమ వద్ద అంత నగదు లేదని, రూ. 35వేలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో డబ్బులను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అనంతరం ఆర్ ఐ పరమేశ్వర్ తన అల్లుడికి విషయం చెప్పడంతో ట్రాన్సాక్షన్ ని వాకబు చేయగా ఎవరో బురిడీ కొట్టించి నట్లు గుర్తించారు. వెంటనే పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. కాగా అధికారులమని చెప్పిన నకిలీ వ్యక్తులు కాజేశారా లేక మండలంలోని తెలిసిన వ్యక్తులే కాజేశారా అని చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed