- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ. 2.55 కోట్ల అవినీతి.. సొసైటీ సభ్యుల ఆందోళన
దిశ,జనగామ:నిడిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అక్రమాల చిట్టా బయట పడుతున్నాయి. ఒక్కరి ఆధార్ కార్డుతో వేరే వారికి లోన్లు మంజూరు చేయడం విడ్డూరంగా ఉంది..సొసైటీలో కొందరు రైతులు అప్పులు తీసుకొని డబ్బులు కట్టి రశీదు తీసుకున్న కట్టలేదని, మరి కొందరు రైతులు అప్పులు తీసుకోకున్నా తీసుకున్నట్లు, ఆధార్ కార్డులు సృష్టించి సీఈవో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు .దీని ఫలితం ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ అర్హులైన రైతులకు అందకుండా పోయేసరికి మనోవేదనకు గురవుతున్నారు.
నిడిగొండ పీఏసీఎస్ పాలకవర్గం తో పాటు సీఈవో చేసిన తప్పిదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే విడు దల చేసిన మూడు విడతల నిధుల్లో పీఏసీఎస్ లోని 554 మంది అర్హులైన రైతులకు సంబంధించి మొత్తం రూ.2.5 కోట్లు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం ఇద్దరు రైతులకు రూ.87 వేలు మాత్రమే మాఫీ అవ్వడం గమనార్హం..గతంలో తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించి రశీదు తో పాటు నో డ్యూస్ సర్టిఫికెట్ అందుకున్న ఇప్పుడు బకాయి ఉన్నట్లు రికార్డులు చూపుతుండడంతో బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సొసైటీకి ప్రస్తుతం గంగిడి నరసింహారెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో సీఈవోగా ఉన్న రాజయ్య ఎనిమిది సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందినప్పటికీ అతని స్థానంలో 2016 నుంచి తన కుమారుడు రాజకుమార్ తన పలుకుబడి ఉపయోగించుకొని సీఈవోగా నియమించుకున్నారు. పేరు కు సీఈఓ కొడుకు కానీ పెత్తనం మెత్తం మాజీ సీఈఓ రాజయ్యదే .. అన్ని తానై వ్యవహరిస్తూ సొసైటీలో జరుగుతున్న అక్రమాల గుట్టును బయటపడకుండా ఇన్నేళ్ళు పబ్బాంగడపారు..30 సంవత్సరాల పాటు సీఈవోగా వ్యవహరించిన రాజయ్య చైర్మన్ లను మచ్చిగా చేసుకొని ఎవరూ ప్రశ్నించకుండా రాజయ్య వారి కుమారుడు రాజ్ కుమార్ అక్రమాలకు పాల్పడినట్లు రైతులు ఆధారాలు చూపిస్తూ ఆరోపిస్తున్నారు. బాధితులు ఎలపాటి కర్ణాకర్, మాధవరెడ్డి ప్రభాకర్ మాల యాదగిరి మాసంపల్లి మహేందర్ దామెర రమేష్, ఊరడి చంద్రారెడ్డి తో పాటు ఇలా నారాయణపురం పత్తే షాపూర్, ఇబ్రహీంపురం బానాజీ పేట, కన్నాయిపల్లి, తో పాటు చుట్టుపక్కల గ్రామాల సొసైటీ సభ్యులు ఇందులో బాధితులుగా ఉన్నారు.
డబ్బులు రికవరీ చేయాలి: మాసన్ పల్లి సంతోజీ, సొసైటీ సభ్యులు
గత 30 సంవత్సరాల నుండి పెదగొని రాజయ్య అనే వ్యక్తి సొసైటీ పై ఆధిపత్యం చేస్తూ తన కనుసన్నుల్లో అక్రమాలు చేస్తూ సొసైటీ సభ్యులను ఇబ్బంది గురి చేస్తున్నారని, రుణమాఫీ విషయంలో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి, అలాగే దానం కొనుగోలులో కూడా రాజయ్య చేతివాటం చూపిస్తూ రైతులకు మోసం చేశారు. సభ్యత్వం కొరకు సభ్యుల దగ్గర డబ్బులు వసూలు చేసి సభ్యత్వ రసీదు ఇవ్వకుండా కాలయాపన చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని డబ్బులు రికవరీ చేయాలి..
ఒకే ఆధార్ కార్డు తో పలువురికి లోన్లు : పెద్దగొని శ్రీనివాస్
నిడిగొండ గ్రామానికి చెందిన పెద్దగోని అంజయ్య తన లోన్ డబ్బులు మొత్తం కట్టి రశీదు తో నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకున్నా అయినా మళ్ళీ లోన్ మాఫీ చేయాలని తన పేరు లిస్టు లో ఎలా పంపిస్తారు అని, ఒకే ఆధార్ కార్డుపై ఇన్ని లోన్లు వారికీ తెలియకుండానే ఎలా చేస్తారు.వెంటనే చర్యలు తీసుకోండి.
ఆందోళన మా దృష్టికి వచ్చింది : రాజేందర్ రెడ్డి, జనగామ జిల్లా డిసీవో
నిడిగొండ పి ఎ సీ ఎస్ లో జరుగుతున్న ఆందోళన మా దృష్టికి వచ్చింది. బాధిత రైతుల సభ్యులు ఎలాంటి ఇబ్బందులు గురికావద్దని, ప్రస్తుతం ఉన్న సీఈవో (సెక్రటరీ) రాజకుమార్ నూ విధుల నుంచి తొలగిస్తున్నామని, వస్తున్న ఆరోపణలపై శాఖ పరమైన దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బాధితులకు న్యాయం చేస్తాం : మాజీ సీఈఓ, పెదగోని రాజయ్య
ఒకే ఆధార్ కార్డు పై ఇతరులకు లోన్ ఇచ్చారని, డబ్బులు కట్టిన వారిని కూడా డబ్బులు కట్టాలని చెప్పామని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఇదంతా టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగిందని, దాన్ని సరి చేసి బాధితులకు న్యాయం చేస్తాం.