- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Prakash Ambedkar : ఛాతీనొప్పితో ప్రకాశ్ అంబేద్కర్‌కు అస్వస్థత
దిశ, నేషనల్ బ్యూరో : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్(Prakash Ambedkar) అస్వస్థతకు గురయ్యారు. ఆయన వయసు 70 ఏళ్లు. గురువారం తెల్లవారుజామున ప్రకాశ్ అంబేద్కర్‌కు ఛాతీనొప్పి రావడంతో వెంటనే పూణేలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గుండెలో బ్లడ్ క్లాట్ ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కాసేపట్లో వైద్యులు ఆంజియోగ్రఫీ చేయనున్నారు.
ఈవివరాలను ప్రకాశ్ అంబేద్కర్‌కు చెందిన రాజకీయ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ (VBA) ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రకాశ్ అంబేద్కర్ మరో మూడు నుంచి ఐదు రోజుల పాటు వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉంటారని వీబీఏ మహారాష్ట్ర అధ్యక్షుడు రేఖా తాయ్ ఠాకూర్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వీబీఏను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ ఏడాది మార్చి నుంచి ప్రకాశ్ అంబేద్కర్ విరామం తీసుకోకుండా పర్యటనలు నిర్వహిస్తున్నారు.