Ponnam Prabhakar : ఇందిరా గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు.. యువతకు మంత్రి సందేశం

by Ramesh N |
Ponnam Prabhakar : ఇందిరా గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు.. యువతకు మంత్రి సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇందిరమ్మ లాంటి నాయకురాలు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుతో కలిసి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం అని పేర్కొన్నారు. నేటికి కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని ఆదర్శంగా తీసుకుని చిరస్థాయిగా నిలిచారని అన్నారు.

ఈరోజు యువత ముఖ్యంగా మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా తమ తమ రంగాల్లో వృత్తి వ్యవహారపరంగా ఎలా ఉండాలో ఇందిరమ్మ ఆదర్శమన్నారు. దేశ ఐక్యత కోసం జాతీయ భావం, అభివృద్ధి పేదల పట్ల పూర్తి శ్రద్ధ అన్ని రకాల అంశాలను ప్రాధాన్యత ఇచ్చిన ఇందిరా గాంధీ స్ఫూర్తి ప్రపంచ స్థాయిలో నిలిచిన నాయకురాలు అని కొనియాడారు. అత్యధిక కాలం ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీకి కాంగ్రెస్ పక్షాన హైదరాబాద్ కాంగ్రెస్ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Next Story