Diwali : శ్మశాన వాటికలో దీపావళి వేడుకలు.. అక్కడ ఇదే సంప్రదాయం అంటా!

by Ramesh N |
Diwali : శ్మశాన వాటికలో దీపావళి వేడుకలు.. అక్కడ ఇదే సంప్రదాయం అంటా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా నిన్నటి నుంచే కొంత మంది సంబరాలు మొదలు పెట్టారు. అయితే, దీపావళి వేడుకలు ఎక్కవగా ఇంటి వద్ద, లేక వ్యక్తికి సంబంధించిన దుకాణాలు, మైదానాల వద్ద టపాసులు కాల్చడం వంటివి జరుగుతుంటాయి. కానీ కరీంనగర్‌లోని ఓ ప్రాంత వాసులు అందుకు బిన్నంగా శ్మశాన వాటికలో దీపావళి వేడుకులు జరిపారు. కరీంనగర్ లోని కార్ఖానా గడ్డ లో ఉన్న హిందూ స్మశాన వాటిక లో కొన్ని దళిత కుటుంబాలు ప్రతి యేటా శ్మశాన వాటికలోనే దీపావళి వేడుకలను జరుపుకుంటూ వస్తున్నారు.

చనిపోయిన తమ పెద్దలను గుర్తు చేసుకుంటూ సమాధుల మధ్య వేడుకలు జరుపుకుంటారు. పండుగకు వారం రోజుల ముందే తమ పెద్దల సమాధులను శుభ్రం చేసి, పూలతో అలంకరించి సాయంత్రం కుటుంబ సభ్యులంతా అక్కడే టపాసులు కాలుస్తారు. అయితే గత ఆరు దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తాజాగా చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed