- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెవులకు చిల్లులు పడే శబ్దాలు..నిద్ర పోయేది ఎలా..?
దిశ ,కమ్మర్ పల్లి: పగలంతా కష్టపడి పనులు చేసి, అలసిపోయి రాత్రి వేళల్లో సేద తీరే సమయంలో చెవులకు చిల్లులు పడేలా హారన్ల మోత,మొరం టిప్పర్ల శబ్దాలతో నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక కాలనీవాసులు వాపోతున్నారు. కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామ పరిధిలోని దమ్మన్నపేట్ (ఓడ్డెర కాలనీ)లోని ఉప్లూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు,దమ్మన్నపేట్ కాలనీ నుంచి నాగపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డుల గుండా అక్రమార్కులు మొరంను భారీ టిప్పర్లలో ప్రైవేట్ పనుల నిమిత్తం తీసుకువెళ్తున్నారు. రోడ్లకు భారీ గుంతలు ఏర్పడి..ద్విచక్ర వాహనాలు నడపలేని పరిస్థితి నెలకొంది. గత 20 రోజుల నుంచి వందల సంఖ్యలో మొరం అక్రమ రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే తీరును మండల ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడంలేదని,నాయకుల అండదండలతోనే మొరం తరలింపులు యథేచ్ఛగా జరుగుతున్నాయని మండల ప్రజలు మండిపడుతున్నారు. ఇష్టానుసారంగా మొరం అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న సంబంధిత అధికారులకు రాష్ట్ర నాయకుడి అండదండలు ముమ్మ రంగా ఉన్నాయని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇంతకు ఆ రాష్ట్ర నాయకుడు ఎవరు..? దిశ దినపత్రికలో ఇటీవల ప్రచురితం అయిన "యథేచ్ఛగా మొరం తవ్వకాలు" అనే కథనానికి... అక్రమార్కులు జాగ్రత్త పడి పగలుపూట మొరం తరలింపులను ఆపి, అర్ధరాత్రి వేలల్లో సాఫీగా మొరం తరలింపులు జరిపి డబ్బులు దండుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మండల స్థాయి,జిల్లా స్థాయి అధికారులు కూడా ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకుల కనుసన్నాల్లో అక్రమ మొరం తరలించే అక్రమార్కుల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరజిల్లుతున్నాయని మండల ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.