Rajasthan : బోరుబావిలో పడిన చిన్నారి.. మూడురోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ

by M.Rajitha |
Rajasthan : బోరుబావిలో పడిన చిన్నారి.. మూడురోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ
X

దిశ, వెబ్ డెస్క్ : మూడేళ్ళ పాప పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావి(Borewell)లో పడిన ఘటన రాజస్థాన్(Rajasthan) లో జరిగింది. మూడు రోజులుగా ఆ పాపను కాపాడే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోఠిపుత్లీ-బెహ్రర్ జిల్లాలో చేతన అనే మూడేళ్ళ పాప.. సోమవారం పొలం వద్ద అడుకుంటూ ప్రమాదవశాత్తు 700 అడుగుల లోతు గల బోరు బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పాప 150 అడుగుల వద్ద చిక్కుకున్నట్లు గుర్తించిన అధికారులు.. చిన్నారిని రక్షించే క్రమంలో మరింత కిందకి జారినట్టు తెలిపారు. బోరుబావిలోకి పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. కాగా మూడు రోజులుగా పాప బొరుబావిలోనే ఉండటంతో తల్లిదండ్రులు చిన్నారి గురించి కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed