- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలనాపాలనా లేక అనాధగా ఆలూరు బైపాస్ రోడ్డు
దిశ, ఆర్మూర్ : కాంగ్రెస్ ప్రభుత్వ ఆలనాపాలనా లేక ఆలూరు బైపాస్ రోడ్డు అనాధగా మారిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆలూరు బైపాస్ రోడ్డు, అక్కడ నిర్మించిన హైలెవల్ బ్రిడ్జ్ ను గురువారం ఉదయం జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాకర్లతో, స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలూరు బైపాస్ రోడ్డు పొడవునా కరెంటు లైట్లు పెట్టడానికి కూడా ఆర్మూర్ మున్సిపాలిటీలో డబ్బులు లేవా? అని నిలదీశారు. అభివృద్ధి పట్ల నిబద్ధత లేని కాంగ్రెస్ సర్కారు అని ఆయన మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో చేపట్టిన పథకాలు, నిర్మాణాల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. ఆలూరు బైపాస్ రోడ్డు నిర్మాణం స్థానిక ప్రజల తరతరాల కల అని ఆయన గుర్తు చేశారు. ఇరుకైన రోడ్డు, వాహనాల రద్దీ, దుమ్మూ ధూళితో స్థానిక ప్రజలకు అనారోగ్య సమస్యలు, పక్కనే ఉన్న చెరువు నిండితే వచ్చే వరదలతో ఆర్మూర్ పట్టణంలోని వేల కుటుంబాలు నిరాశ్రయులు కావడం వంటివి ప్రతీ ఏటా ప్రజలకు ప్రాణ సంకటంగా మారాయని ఆయన తెలిపారు. ప్రజల బాధలను గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసిన పట్టించుకున్న నేతలే లేరని, తెలంగాణ ఉద్యమ సమయంలో తాను కూడా స్థానిక ప్రజలతో కలిసి ఆలూరు బైపాస్ రోడ్డు కోసం ఆందోళనలు చేపట్టామని జీవన్ రెడ్డి వివరించారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకాపూర్ పర్యటన సందర్భంగా తాను చేసిన బైపాస్ రోడ్డు ఆందోళనను గుర్తు చేసి..దాని కోసం అక్కడికక్కడే రూ.13 కోట్లు మంజూరు చేశారని, భూసేకరణ కోసం ఉత్తర్వులు జారీచేశారని జీవన్ రెడ్డి వివరించారు. స్థానిక ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన లోలెవల్ బ్రిడ్జ్ స్థానంలో హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం రెండున్నర కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. ఆలూరు బైపాస్ రోడ్డు వల్ల 50 గ్రామాలకు కనెక్టివిటీ కలిగిందని, ఇరుకు రోడ్డు పోయి విశాలమైన రోడ్డుతో ప్రజలు కుదుట పడ్డారన్నారు. హైలెవల్ వంతెనతో నీటి ముప్పు తప్పిందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది నుంచి ఆలూరు బైపాస్ రోడ్డును నిర్లక్ష్యం చేస్తోందని, ఆలనాపాలనా కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆలూరు బైపాస్ రోడ్డు పొడవునా కరెంటు లైట్లు కూడా పెట్టకపోవడం వల్ల స్థానిక ప్రజలతో పాటు..వాకర్లు కూడా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ లు ఇకనైనా ఆలూరు బైపాస్ రోడ్డుపై శ్రద్దపెట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
నందిపేట్ డబుల్ రోడ్డు పొడవునా మొక్కలు నాటాలి
రూ. 13 కోట్ల రూపాయలతో నిర్మించిన నందిపేట్ డబుల్ రోడ్డు పొడవునా మొక్కలు నాటాలని మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నందిపేట్ డబుల్ రోడ్డును గురువారం పరిశీలించిన జీవన్ రెడ్డి పలు సూచనలు చేయడమేకాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు, కట్టిన నిర్మాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నందిపేట్ డబుల్ రోడ్డు డివైడర్ పొడవునా విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటి వాటి సంరక్షణపై శ్రద్దపెట్టాలని జీవన్ రెడ్డి కోరారు.