- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గతేడాది కన్నా పెరిగిన కేసుల సంఖ్య
దిశ, జగిత్యాల ప్రతినిధి : గత సంవత్సరం కన్నా ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగినప్పటికీ శాంతిభద్రతల విషయంలో బాగానే ఉందని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వార్షిక నివేదిక వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా జగిత్యాల టౌన్ పీఎస్ లో 791 కేసులు నమోదైతే అత్యల్పంగా బీర్పూర్ పోలీస్ స్టేషన్లో 120 కేసులు నమోదైనట్లు తెలిపారు. 2023 డిసెంబర్ చివరి వారం వరకు జిల్లాలో మొత్తం 4,999 కేసులు నమోదైనట్టుగా వివరించారు.
గత ఏడాదితో పోల్చితే 2024 సంవత్సరంలో హత్యలు, అత్యాచారాలు తగ్గాయన్నారు. రోడ్డు ప్రమాదాలు సైతం గతంలో కంటే తగ్గినప్పటికీ ప్రమాదాల్లో మృతి చెందిన వారు గతంలో కంటే 29 మంది ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. చాలా వరకు కేసుల పురోగతిలో పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లుగా వెల్లడించారు. పోలీసు శాఖ నిర్విరామంగా ప్రజల రక్షణ కోసం, శాంతిభద్రతల కోసం పనిచేస్తుందని అన్నారు. ఈ వార్షిక సమావేశంలో డీఎస్పీలు రఘు చందర్, రాములు, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, సీఐ లు, ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.