- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Warangal : ఎస్సైనే తన చావుకి కారణమంటూ చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నం..
దిశ, వరంగల్ : వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో బుధవారం అర్ధరాత్రి ఓ చిరు వ్యాపారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ బాటిల్ లాక్కున్న పోలీస్ సిబ్బంది ప్రధమ చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని కొత్తవాడ కు చెందిన పైడి శ్రీధర్ అనే వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోని ఆటోనగర్ లో తెలంగాణ ఫాస్ట్ ఫుడ్ (Fast food) సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. అయితే రోడ్డుపైన ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తడంతో పోలీసులు గతంలో శ్రీధర్ కి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. అయినప్పటికీ శ్రీధర్ తన పద్ధతి మార్చుకో కపోవడంతో మట్టేవాడ ఎస్సై విటల్ తన పెట్రోలింగ్ (Patrolling) లో భాగంగా బుధవారం రాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని ఫోటోలు తీసి రోడ్డుమీద షాప్ నిర్వహించవద్దని హెచ్చరించాడు.
దీంతో మనస్థాపానికి గురైన శ్రీధర్ పెట్రోల్ బాటిల్ తో రాత్రి మట్టెవాడ పోలీస్ స్టేషన్ (Police station) కు చేరుకొని తన చావుకు ఎస్సై విటల్ కారణమంటూ, వ్యాపారానికి అడ్డు వస్తున్నాడని ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకొని అనంతరం అగ్గిపుల్ల గీసేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. శ్రీధర్ వద్దగల అగ్గిపెట్టె, పెట్రోల్ బాటిల్ లాక్కొని శ్రీధర్ ఒంటిపై నీరు చల్లి శ్రీధర్ స్నేహితులను పిలిపించి ప్రధమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు మట్టేవాడ పోలీసులు తెలిపారు.