పండగ పూట విషాదం.. గోదావరిలో వ్యక్తి గల్లంతు

by Aamani |
పండగ పూట విషాదం.. గోదావరిలో వ్యక్తి గల్లంతు
X

దిశ, భద్రాచలం : హైదరాబాద్ నగరానికి చెందిన చలపతి (25) తన ఇద్దరి స్నేహితులతో కలిసి భద్రాచలం గోదావరి స్నానాల ఘాట్ దగ్గర స్నానం చేస్తుండగా లోతు తెలియక పోవడంతో ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి గల్లంతయ్యారు.గల్లంతైన వ్యక్తితో పాటు మరో ఇద్దరు ప్రమాదంలో ఉండగా, గౌతమి ఘాట్ ఫోటోగ్రాఫర్స్ రాజమండ్రి సాయి, కరకు ప్రసాద్ కాపాడారు. అయితే గత కొన్ని రోజులుగా అనేకమంది గోదావరిలో మునిగి గల్లంతు అయి ప్రాణాలు పోతున్నా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు కాని, పంచాయతీ అధికారులు కానీ ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. గతంలో గోదావరి లోతు తెలిపే హెచ్చరిక బోర్డులు, కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అవి ఏర్పాటు చేయకపోవడం కారణంగా భక్తులు పుణ్య స్నానాలకు వెళ్లి గోదావరిలో మునిగి చనిపోతున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ చర్యలు తీసుకోవాలని, వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed