India : విమానాలకు బాంబు బెదిరింపులు.. దర్యాప్తుపై భారత్‌ కీలక నిర్ణయం

by Hajipasha |
India : విమానాలకు బాంబు బెదిరింపులు.. దర్యాప్తుపై భారత్‌ కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో : గత రెండు వారాల్లో విమానయాన సంస్థలకు 410కిపైగా బాంబు బెదిరింపులు రావడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. వాటి వెనుక ఉన్నవారిని గుర్తించాలనే లక్ష్యంతో భారత(India) దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందుకోసం ఇంటర్‌పోల్‌(Interpol), అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ(FBI) సాయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ బెదిరింపు మెసేజ్‌ల వెనుక అమెరికా, కెనడాలు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని భారత్ అనుమానిస్తోంది. అక్కడి దర్యాప్తు సంస్థల సాయం లభిస్తే.. వారిని సులభంగా పట్టుకోవచ్చని అనుకుంటోంది. ఈక్రమంలో భారత్‌కు సహకరించేందుకు అమెరికా ఎఫ్‌బీఐ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈవిషయాన్ని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం ధ్రువీకరించింది.

ఇక జర్మనీ, యూకే నుంచి సమాచార సేకరణకు సాయం చేయాలని ఇంటర్‌పోల్‌‌ను భారత్ కోరింది. వీపీఎన్‌లను వాడి పంపిన బెదిరింపు మెసేజ్‌ల మూలాలు ఆయా దేశాల్లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడంలో సహకరించాలని రిక్వెస్ట్ చేసింది. ఇటీవలే సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థ నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ ఎయిర్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. నవంబరు 1 నుంచి 19 మధ్య ఎయిర్‌ ఇండియా విమానాలను ఎక్కొద్దని అతడు ప్రజలకు హెచ్చరిక జారీ చేయడం కలకలం రేపింది.

Advertisement

Next Story

Most Viewed