Chennur MLA : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తాను..

by Aamani |
Chennur MLA :  ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తాను..
X

దిశ, చెన్నూరు : నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే(Chennoor MLA) వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సి ఎస్ ఆర్ నిధులతో మంజూరైన రెండు అంబులెన్స్ సేవలను ఆయన కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ గ్రామాల్లో సరియైన రవాణా సదుపాయం లేక వైద్యం కోసం చెన్నూరు, మంచిర్యాల వెళ్లడానికి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి రెండు కొత్త అంబులెన్స్ ప్రారంభించడం జరిగిందని అన్నారు.

అతి త్వరలోనే మరో రెండు అంబులెన్స్ సేవలను కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో పని చేయాలని సమయాన్ని చూసుకుంటూపని చేయకూడదని, ప్రజలు ఎంతో నమ్మకంతో వైద్య సేవలకు వస్తారని వారికి నమ్మకం కలిగించే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని లేని పక్షంలో శిక్షలు తప్పవు అని అన్నారు. కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ హరీష్ రాజ్, సూపరిండెంట్ డాక్టర్ సత్యనారాయణ, కోటపల్లి వైద్యాధికారిని అరుణ శ్రీ, సిబ్బంది జగదీష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story