- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Cold Wave: ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలితీవ్రత
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాది రాష్ట్రాల్లో(North India) చలి తీవ్రత పెరిగిపోయింది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9.6 డిగ్రీలకు పడిపోయాయి. జనవరి 8వ వరకు దేశ రాజధానిలో మంచు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. ఈ మధ్య తేలికపాటి వర్షాలు కూడా పడొచ్చని తెలిపింది. దీంతో ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ వ్యాప్తంగా మంచు దట్టంగా కురుస్తోంది. పొగమంచు (Fog) కారణంగా విమాన, రైల్వే సేవలకు ఆటంకం కలిగింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో విజిబిలిటీ 50 మీటర్లకు తగ్గిపోయింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో అయితే విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. విమాన సర్వీసులు రద్దు, ఆలస్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో, ప్రయాణికులు ఓసారి షెడ్యూల్ చూసుకొని బయలుదేరాలని విమానయాన సంస్థలకు ప్రకటన విడుదల చేశాయి. ఇకపోతే, పొగమంచు వల్ల రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి బయల్దేరే 20కి పైగా రాళ్లు విజిబిలిటీ కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. అయోధ్య ఎక్స్ ప్రెస్, నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ కూడా షెడ్యూల్ కంటే రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది.
చలిగాలులు
హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, బిహార్‌తో సహా పలు రాష్ట్రాల్లోను చలి తీవ్రత పెరిగిపోయింది. విపరీతంగా పొగమంచు కురుస్తోంది. చలిగాలుల (Cold Wave) దృష్ట్యా నోయిడాలోని అన్ని స్కూళ్లలో 8వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. బిహార్ రాజధాని పాట్నా సహా పలు ప్రాంతాల్లో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో, బిహార్ ప్రభుత్వం పాఠశాల వేళల్లోనూ పలు మార్పులు చేసింది. రాజస్థాన్‌లోని ఫతేపుర్‌లో గత 24 గంటల్లో 3.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది