Food poisoning : గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..30 విద్యార్థినులకు అస్వస్థత

by Aamani |
Food poisoning : గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..30 విద్యార్థినులకు అస్వస్థత
X

దిశ, వాంకిడి : మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు బుధవారం రాత్రి ఫుడ్ పాయిజన్ అయింది. సాయంత్రం భోజనానంతరం 30 విద్యార్థులు ఒక్కసారిగా కడుపు నొప్పితో కూడిన వాంతులు విరేచనాలు చేయడంతో స్థానిక ఏఎన్ఎం పరీక్షించి వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. చికిత్స అనంతరం 27 మంది విద్యార్థినిలు కోలుకోగా అందులో ఇద్దరు వాంకిడి, మరో ఒకరు ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు.

విద్యార్థుల అస్వస్థతకు ఫుడ్ పాయిజన్, కలుషితమైన తాగునీరె కారణమని పలువురు విద్యార్థులు ఆరోపించారు. వంటగది, వంట సామాగ్రి అశుభ్రతతో పాటు విద్యార్థులకు తాగునీరు అందించే వాటర్ ట్యాంక్ నెలల తరబడి శుభ్రం చేయకుండా నీరు అందిస్తున్నారని వాపోయారు. గతంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్న, బయటకు రాకుండా సిబ్బంది జాగ్రత్తపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక స్థానికంగా ఉండి విద్యార్థుల అలానపాలనా చూసుకోవాల్సిన వార్డెన్ స్థానికంగా ఉండకుండా కాగజ్ నగర్ నుంచి రోజు రాకపోకలు చేస్తున్నారు. దీంతో హాస్టల్ పర్యవేక్షణతో విద్యార్థులను పట్టించుకునే వారు కరువయ్యారు.

Advertisement

Next Story

Most Viewed