- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Iran : ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతిదాడికి ప్లాన్ రెడీ ?
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్ష ఎన్నికల(US election) పోలింగ్ నవంబరు 5న జరగనుంది. ఈ తేదీ కంటే ముందే అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్(Iran) ప్రతీకార దాడి చేసే అవకాశం ఉంది. ఈమేరకు అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు ప్రచురితం అయ్యాయి. అక్టోబరు 1న ఇజ్రాయెల్(Israel) రాజధాని టెల్‌అవీవ్‌పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా అక్టోబరు 26న ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన ఇరాన్ గట్టి హెచ్చరికలు చేసింది. తగిన సమయం చూసి ప్రతిదాడి చేస్తామని వెల్లడించింది. ఈ హెచ్చరికలపై ఇజ్రాయెల్ స్పందిస్తూ.. ప్రతిదాడికి తెగబడితే తమ దెబ్బ తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. మొత్తం మీద అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసేలోగా ఇజ్రాయెల్‌పై దాడి ప్రక్రియను పూర్తి చేయాలని ఇరాన్ యోచిస్తోంది.