- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BJP: ఈ ఏడాదే ఆ కుట్రను ఆపాలి.. పండుగ సందర్భంగా రాజాసింగ్ కీలక రిక్వెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి(Diwali) పటాకులపై లక్ష్మీ దేవి(లక్ష్మి devotee) బొమ్మ కనిపిస్తే కాల్చొద్దని గోషామహాల్(Goshamahal) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) రిక్వెస్ట్(Request) చేశారు. పండుగ సందర్భంగా సోషల్ మీడియా(Social Media)లో వీడియో విడుదల చేసిన ఆయన ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు(Diwali Wishes) చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. దీపావళి సందర్బంగా రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తామని, పిల్లలను తల్లిదండ్రులు దగ్గరుండి పటాకులు కాల్పించాలని, అవి ఎంత మోతాదులో కాలుతాయో వారికి తెలియక ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే దీపావళి పండుగ రోజు మనం లక్ష్మీ మాతను పూజిస్తామని, కానీ అదే లక్ష్మీ మాత బొమ్మ ఉన్న పటాకులను మనుకు అమ్ముతున్నారని తెలిపారు. ఈ కుట్ర ఎన్నో సంవత్సరాలుగా మనపై జరుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పండుగ నుంచి ఒక సంకల్పం తీసుకోవాలని, మన దేవుడి బొమ్మలు ఉన్న పటాకులు మనం కాల్చకుండా ఉంటే.. వచ్చే సంవత్సరం అలాంటి పటాకులు ఎవరూ అమ్మకుండా ఉంటారని, దయచేసి అందరూ ఇది పాటించాలని కోరారు. చివరగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.