Revanth Reddy: ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లకు సీఎం ఘన నివాళులు

by Ramesh Goud |
Revanth Reddy: ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లకు సీఎం ఘన నివాళులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhai Patel) జయంతి సందర్భంగా సీఎం(CM Revanth Reddy) ఘన నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్(Jubili Hills) లోని ముఖ్యమంత్రి నివాసంలో ఇందిరా గాంధీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రాపటాలకు పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన అతీతమైన సేవలను గుర్తు చేసుకున్నారు. సర్దార్ పటేల్ గారి సేవలను స్మరిస్తూ జరుపుకునే జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానాల విలీనం ద్వారా స్వాతంత్య్ర భార‌త‌దేశ సార్వ‌భౌమ‌త్వానికి నిండుద‌నాన్ని చేకూర్చిన ఉక్కుమనిషి సర్దార్ ప‌టేల్ గారని కొనియాడారు.

అలాగే దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహనీయురాలు ఇందిరా గాంధీ గారని అన్నారు. రాజ‌భ‌ర‌ణాల ర‌ద్దు, బ్యాంకుల జాతీయీక‌ర‌ణ, 20 సూత్రాల కార్య‌క్రమం వంటి విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌తో దేశ ప్ర‌గ‌తికి, పేద‌ల అభ్యున్న‌తికి ఇందిరా గాంధీ గారు ఎంత‌గానో కృషి చేశార‌ని గుర్తుచేశారు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారి స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రంలో సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkatreddy), ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్(Raj Takur) పాల్గొని మహనీయులకు నివాళులు అర్పించారు. కాగా స్వాతంత్ర సమరయోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి మొదటి ఉప ప్రధానిగా సేవలు అందించగా.. ఇందిరా గాంధీ ప్రధానిగా పని చేశారు.

Advertisement

Next Story

Most Viewed