Road Accidents: నెత్తురోడిన రహదారులు.. పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో వరుస విషాదాలు

by Y.Nagarani |
Road Accidents: నెత్తురోడిన రహదారులు.. పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో వరుస విషాదాలు
X

దిశ, వెబ్ డెస్క్: పండుగవేళ కొన్ని కుటుంబాల్లో రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా గడపాల్సిన రోజున.. అనంత లోకాలకు వెళ్లారు. ఏపీ, తెలంగాణల్లో జరిగిన రోడ్డుప్రమాదాల్లో పలువురు మరణించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి ఘాట్ రోడ్డులో వ్యాన్ - బైక్ ఢీ కొని ఇద్దరు మృతి చెందారు.

కావలిలో (Kavali train accident) రైలు ఢీ కొని తల్లి, కూతురు మరణించారు. తల్లి వజ్రమ్మను విజయవాడ ప్యాసింజర్ రైలు ఎక్కించేందుకు స్టేషన్ కు వచ్చింది శిరీష. ఈ క్రమంలో ఇద్దరూ పట్టాలు దాటుతుండగా.. 3వ ప్లాట్ ఫాం వద్ద వేగంగా వచ్చిన కోయంబత్తూరు ఎక్స్ ప్రెస్ రైలు (coimbatore express) ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం ఆత్కూర్ క్రాస్ రోడ్డు వద్ద లారీ - ఆటో పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 13 మంది కూలీలు నెల్లూరు జిల్లాలో బొప్పాయి కోతకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కొనకళ్ల నాగరాజు (20), ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఉయ్యాల సాయికుమార్ (27)గా మృతి చెందారు.

విశాఖపట్నంలోని పద్మనాభం మండలం రేవిడిలోని కురస్వా రిసార్ట్స్ లో (Kuraswa Resorts) విషాదం నెలకొంది. మద్యం మత్తులో ఈతకు దిగిన అభిషేక్ వంశీ (23) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు వచ్చిన అభిషేక్ మరణం.. స్నేహితుల్ని కలచివేసింది.

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ స్టేజి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో దంపతులు మృతి చెందారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కారు ఢీ కొట్టగా.. దంపతులు మరణించారు. శుభకార్యానికి వెళ్లి గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను నర్సింహారెడ్డి (63), సరోజిని (58)గా గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed