- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Congress MLA : నివాళులర్పిస్తూ.. కిందపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే! కూలిన గద్దె.. వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ Indira Gandhi వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని కరీంగనర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం Congress MLA Medipalli Satyam ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలోనే ఒక అపశ్రుతి చోటుచేసుకుంది. పూలమాల వేసే క్రమంలో హైలాండ్ వద్ద ఉన్న విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె స్వల్పంగా కూలడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే కిందపడ్డారు.
ఈ ఘటనతో అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే కార్యకర్తలు ఎమ్మెల్యేను పైకి లేపారు. నాకు ఏమి కాలేదంటూ ఎమ్మెల్యే సత్యం సమాధానం చెప్పడంతో అందరూ కాస్త కుదుటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గద్దెను సరిగా కట్టలేదని, చూసుకోవాలి కాదండి సార్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
నివాళులర్పిస్తూ.. కిందపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేకరీంనగర్ పట్టణంలోని.. ఇంధిరా చౌక్ వద్ద ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపూలమాల వేసే క్రమంలో హైలాండ్ వద్ద ఉన్న విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె స్వల్పంగా కూలడంతో ఒకసారిగా కిందపడ్డ… pic.twitter.com/BWNqIKVETm
— Telugu Galaxy (@Telugu_Galaxy) October 31, 2024