- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమాయకంగా కనిపిస్తూ లక్షలు దోచేస్తున్న మహా కేటుగాడు.. డిపాజిట్ మెషీన్ వద్ద నయా మోసం
దిశ, వెబ్ డెస్క్: చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తాడు. ఏటీఎంలో డిపాజిట్ మెషీన్ వద్దకు వచ్చే వాళ్లే వీడి టార్గెట్. మీకెందుకు టైం వేస్ట్.. ఆ డబ్బేదో నాకే ఇవ్వండి.. నేను మీకు డైరెక్ట్ గా ఫోన్ పే (Phone pay) నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తాడు. వాడి ఫేస్ చూసి నిజమేనని నమ్మినవారు వేలకువేలు చేతిలో పెట్టి.. మొబైల్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఇస్తారు. ఫేక్ ఫోన్ పే ట్రాన్సాక్షన్ చూపించి.. ఇదిగో మీకు ట్రాన్స్ఫర్ అయిపోయిందంటాడు. అలా రోజుకి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ కాజేస్తున్నాడు ఈ నయా కేటుగాడు. డబ్బు డిపాజిట్ చేయడానికి అక్కడికి వచ్చిన ఓ వ్యక్తికి అతనిపై అనుమానం కలిగి ప్రశ్నించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూల్ లోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద కార్తీక్ అనే యువకుడు ఉంటాడు. డిపాజిట్ చేసేందుకు వచ్చిన వారికి తానే ట్రాన్స్ ఫర్ చేస్తానని చెప్పి.. ఫేక్ ట్రాన్సాక్షన్ చూపించి మోసం చేస్తున్నాడు. అలా మోసపోయిన ఓ వ్యక్తి గట్టిగా అతన్ని ప్రశ్నించడంతో నిజం ఒప్పేసుకున్నాడు. పోనీ నిరుద్యోగా అంటే అదీ కాదు. నువ్వు ఏం చేస్తుంటావు అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నాడు. అది విన్నాక అతన్ని ప్రశ్నించిన వ్యక్తికి ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది. తమ నుంచే 40 వేలు తీసుకుని మోసం చేశాడని, ఇలా రోజుకి 2 లక్షల వరకూ సంపాదిస్తున్నాడని బాధితుడు పేర్కొన్నాడు. కర్నూల్ లో ఉన్నవారంతా ఇలాంటి వారితో, ఈ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇలా డబ్బులు సంపాదించి ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగులు, లూడో వంటివి ఆడుతున్నాడని చెప్పారు. టూటౌన్ లో అతనిపై కంప్లైంట్ ఇచ్చామని, బాధితులెవరైనా ఉంటే అక్కడ ఫిర్యాదు చేయవచ్చన్నారు.