Navodaya : నవోదయ దరఖాస్తుకు మరో మారు పెంపు

by Kalyani |   ( Updated:2024-10-31 08:07:42.0  )
Navodaya : నవోదయ దరఖాస్తుకు మరో మారు పెంపు
X

దిశ, బిజినపల్లి : బిజినపల్లి మండలం, వట్టెం గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-2026 విద్యా సంవత్సరం 9వ, 11వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశానికి గాను అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 30తో ముగియనుండగా గడువును మరొక తొమ్మిది రోజులు అనగా నవంబర్ 9 వ తేదీ వరకు పెంచినట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, విద్యార్థుల అభ్యర్థన మేరకు గడువు పెంచారని ఆయన పేర్కొన్నారు. 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను 9వ తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ… 01.05.2010 నుండి 31.07.2012 తేదీల మధ్య జన్మించి ఉండవలెనని, 11వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చదువుతూ… 01.06.2008 నుండి 31.07.2010 తేదీల మధ్యలో జన్మించి ఉండవలెనని పేర్కొన్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న బాల బాలికలు ఉచితంగా www.navodaya.gov.in

లేదా

https://cbseitms.nic.in/2024/nvsix/

https://cbseitms.nic.in/2024/nvsxi_11/

ద్వారా ఆన్ లైన్ లో 09.11.2024(శని వారం)లోగా దరఖాస్తు చేసుకోవాలని నవోదయ ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ కోరారు. అలాగే వారి తల్లిదండ్రుల నివాసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అయి ఉండాలని అన్నారు. రెండు తరగతుల ప్రవేశ పరీక్ష 08.02.2025 (శనివారం )న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed