- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao : మాటలే తప్ప చేతలు లేని సీఎం రేవంత్ సర్కార్ : హరీష్ రావు
దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాటలు నీటి మూటలే అయ్యాయని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. సీఎం రేవంత్ సర్కార్ కు మాటలే తప్ప చేతలు లేవని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి, పది రోజులు కూడా గడవలేదని, మళ్ళీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకున్న తీరు గురుకులాల అధ్వాన్న దుస్థితికి నిదర్శనమన్నారు.
30 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో మహబూబ్ నగర్ జిల్లా దవాఖానలో చేరడం ఆందోళన కల్గిస్తుందని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలని.. ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని హరీష్ రావు ప్రశ్నించారు.
Also Read: