MLC Kavitha : ఓ తల్లిగా నా మనసు కలచి వేసింది! పురుగుల అన్నం తిని.. కవిత ఎమోషనల్ ట్వీట్

by Ramesh N |
MLC Kavitha : ఓ తల్లిగా నా మనసు కలచి వేసింది! పురుగుల అన్నం తిని.. కవిత ఎమోషనల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మక్తల్ పరిధిలోని మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనపై (BRS) బీఆర్ఎస్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మంగళవారం ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన 24 గంటల్లోనే.. నారాయణపేట జిల్లా (Maganoor government school) మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు.

బంగారు భవిష్యత్తుకై పుస్తకాల బ్యాగులు పట్టుకుని పాఠశాలకు వెళ్లిన పిల్లలు.. పురుగులు పట్టిన అన్నం తిని, బాధ భరించలేక కడుపు పట్టుకుని రోదిస్తుండటం చూసి ఓ తల్లిగా నా మనసు కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పాఠశాలలో (Food Poisoning) కలుషితమైన ఆహారం తిని 30 మంది ఆసుపత్రిలో చేరిన వారం లోపే.. మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన జరగడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రతి పది రోజులకు ఒక పసి ప్రాణం పోతున్నా కూడా సర్కారులో చలనం లేదని, ఇదేనా ప్రజా పాలన అంటే? అని నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed