రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దుకు ఫిర్యాదు.. చర్యలు ప్రారంభించినట్లు కోర్టుకు తెలిపిన కేంద్రం

by Mahesh |   ( Updated:2024-11-26 11:51:48.0  )
రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దుకు ఫిర్యాదు.. చర్యలు ప్రారంభించినట్లు కోర్టుకు తెలిపిన కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ ప్రధాని మనువడు, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi') భారత పౌరసత్వం(Indian citizenship) వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో రాహుల్ గాంధీ భారత పౌరుడు కాదని.. ఆయనకు బ్రిటీష్ పౌరసత్వం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంపై బ్రిటీష్ పౌరసత్వం(British citizenship) కలిగిన రాహుల్ గాంధీ.. భారత పౌరసత్వం కూడా కలిగి ఉన్నాడని.. రెండు దేశాల్లో పౌరసత్వాన్ని కలిగి ఉండటంతో రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దు చేయాలని, దీనిపై సీబీఐ దర్యాప్తు(CBI investigation) చేయాలని,, కర్ణాటక బీజేపీ నేత విఘ్నేశ్(BJP leader Vignesh) కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై నేడు విచారణ జరగ్గా.. రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత పౌరసత్వం రద్దు కు సంబంధించి.. హోం శాఖకు ఫిర్యాదులు అందాయని.. ఈ విషయంపై తాము చర్యలు ప్రారంభించినట్లు అలహాబాద్ హై కోర్టుకు(Allahabad High Court) కేంద్రం తెలిపింది. అలాగే డిసెంబర్ 19న జరిగే తదుపరి విచారణలో రాహుల్ గాంధీ పౌరసత్వం(Citizenship of Rahul Gandhi) పై నమోదైన ఫిద్యాదులకు కేంద్ర హోం శాఖ(Central Home Department) తీసుకున్న చర్యలను వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. దీంతో రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దుపై ఆ రోజు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read:

BJP : రాష్ట్రపతిని అవమానించిన రాహుల్ గాంధీ! బీజేపీ ఆరోపణలు.. వీడియో వైరల్


Advertisement

Next Story

Most Viewed