- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ నిర్వాసితుల ఇండ్ల నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇవ్వాలి : మునుగోడు ఎమ్మెల్యే
దిశ,మర్రిగూడ: శివన్నగూడ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితుల ఇండ్ల నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇవ్వాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో పర్యటించి ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన శివన్నగూడలో మాట్లాడుతూ డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల ఇండ్ల నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు.
మండలంలో నీ శివన్న గూడెం లో 20 లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, కొట్టాల గ్రామంలో 12 లక్షలతో నిర్మించే అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన ,నాంపల్లి మండలంలో దేవత్ పల్లి గ్రామ పంచాయతీ నుండి సాగర్ హైవే రోడ్డు వరకు 4:35 కోట్లతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డు ను ప్రారంభం, నాంపల్లి మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాల నుండి గుర్రం పూర్ రోడ్డు వరకు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ నాంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, కత్తి రవీందర్ రెడ్డి నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు మాజీ జడ్పీటీసీలు పాశం సురేందర్ రెడ్డి ఏవీ రెడ్డి, మేతరి యాదయ్య కాంగ్రెస్ నాయకులు పూల వెంకటయ్య ,ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పలు గ్రామాల్లో ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించారు.