- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణం….ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలోని పలు డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శేరిలింగంపల్లి సర్కిల్, చందానగర్ సర్కిల్ పరిధిలోని పలు డివిజన్లలో కాలనీలలో చేపట్టిన సీసీ రోడ్లు నాసిరకంగా నిర్మించడం చాలా బాధాకరమని, నాసిరకంగా కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్లు నిర్మించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మించిన రోడ్లు నాసిరకంగా ఉండడం వల్ల 6 నెలలలోపే దెబ్బతింటున్నాయని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. అటు ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుంతుందని ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, బ్లాక్ లిస్ట్ లో పెట్టి వారికి మళ్ళీ పనులు అప్పగించకూడదని సూచించారు. ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లనే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని, ఇంత జరుగుతున్నా ఎందుకు మిన్నకుంటున్నారని ప్రశ్నించారు. అధికారులు తీరు మార్చుకోవాలని, మౌలిక వసతులు కల్పించే క్రమంలో అధికారులు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని లేదంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు. నాణ్యత లోపించిన రోడ్లను కార్పొరేటర్, అధికారులు, కాలనీ వాసులతో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎస్ ఈ శంకర్ నాయక్, ఈఈ ప్రసాద్, డీఈ ఆనంద్, ఏఈ సంతోష్, నాయకులు రఘునాథ్ రెడ్డి, ప్రసాద్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.