- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడాది పాలన ప్రజలు హర్షిస్తున్నారు : ఆలేరు ఎమ్మెల్యే
దిశ, రాజాపేట: ఏడాది ప్రజా పాలనను ప్రజలు హర్షిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు.అంతకు ముందు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్మికులకు జాతీయ ఉపాధి హామీ పథకంలో వందరోజులు పూర్తి చేసుకున్న వృద్ధులకు సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయవత్సవాలలో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నరు.అందులో భాగంగా ఆలేరు నియోజకవర్గం రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.