- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్లిన గుడ్లు.. పట్టించుకోని అధికారులు
దిశ, పర్వతగిరి: చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక లోపాలు అధిగమించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహార పంపిణీ చేస్తోంది. ఒక్కో లబ్ధిదారుకు ప్రతినెలా 16 కోడిగుడ్లను అందించాలి. గుడ్లయితే ఇస్తున్నారు కానీ... అందులో నాణ్యత ఉండటం లేదు. ఫలితంగా ఉన్నతమైన లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పౌష్టికాహార లక్ష్యానికి గండిపడుతోంది. పేదల కోసం ఎంతో ఖర్చుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పర్యవేక్షణా లోపంతో గాడితప్పుతోంది.మండల కేంద్రంలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాలలో కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. మండల కేంద్రంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు గుడ్లపై అనుమానం వచ్చి పగలగొట్టి చూడటంతో కుళ్లిపోయిన గుడ్లు దుర్వాసనతో దర్శనం ఇచ్చాయి.
అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ... అధికారుల నుంచి ఎలాంటి పర్యవేక్షణా లేదని ఇది కాంట్రాక్టర్లకు వరంగా మారిందని,సాధారణంగా ఒక గుడ్డు 50గ్రాములుండాలని కానీ కాంట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న గుడ్లు చాలావరకు నాసిరకంగా ఉంటున్నాయని తక్కువ ధరకు దొరికే... తక్కువ పరిమాణంలో ఉన్న, మురిగిపోయిన గుడ్లు సరఫరా చేస్తున్నారని గుడ్లు చిన్నగా ఉంటున్నాయని, ఉడికించిన గుడ్ల నుంచి దుర్గంధం వస్తోందని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా సంక్షేమాధికారులు చొరవ తీసుకొని అంగన్వాడీ కేంద్రాలను అందిస్తున్న ఆహార పదార్థాలను ప్రత్యేకంగా పర్యవేక్షించి అందించాలని స్థానిక లబ్ధిదారులు కోరుతున్నారు.