- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీసీటీవీ ఫుటేజ్ తో దొంగను గుర్తించిన పోలీసులు
దిశ, కాటారం : కాటారం ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ కళాశాలలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి అరెస్టు చేసినట్లు కాటారం సబ్ ఇన్స్పెక్టర్ అభినవ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.ఈ నెల 3 వ తేదీన రాత్రి కాటారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ కళాశాలలో ల్యాబ్ లో భద్రపరచిన టీవీ (55") ని గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా, సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడు ను గుర్తించారు. కాటారం గ్రామానికి చెందిన గంట పరిపూర్ణం (21)గా గుర్తించి, మంగళవారం కాటారం లోని అతని ఇంటివద్దనే నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. దొంగిలించబడిన టీ వీ ( విలువ : 66,000/-) ని స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
నిందితుడు గంట పరిపూర్ణం 2022 సంవత్సరంలో ట్రాక్టర్ బ్యాటరీ దొంగతనం కేసు, గత ఏప్రిల్ నెలలో గంజాయి కేసులో నిందితుడిగా ఉండి, జైలు కి కూడా వెళ్ళి ఇటీవలే బెయిల్ పై వచ్చి ఇంటి వద్దనే ఉంటూ, తనకు జల్సాలు చేయడానికి డబ్బులు లేక తాను ఈ దొంగతనానికి పాల్పడ్డానని విచారణలో ఒప్పుకున్నాడు. ఈ విచారణలో సిబ్బంది కానిస్టేబుల్స్ లవన్, సంపత్, నాగరాజు, రఘు, నరేష్, హోం గార్డ్స్ తిరుపతి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా ప్రతి గ్రామాలలోని ప్రజలు ప్రధాన కుడళ్ళలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాల ద్వారా నేరలను అదుపు చేయడం సాధ్యమవుతుందని అందరు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని ఎస్ ఐ అభినవ్ కోరారు.