- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరూరి రమేష్ పై ప్రజలకు నమ్మకం పోయింది : కేఆర్ నాగరాజు
దిశ, వర్ధన్నపేట : ఆరూరి రమేష్ పై ప్రజలకు నమ్మకం పోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్ నాగరాజు అన్నారు. శనివారం నియోజకవర్గంలోని 14వ డివిజన్ పరిధిలోని ఎనుమాముల, సుందరయ్య నగర్, బాలాజీ నగర్, ఎస్ఆర్ నగర్, రెడ్డిపాలెం, కార్లమార్క్ నగర్, ఇందిరమ్మ కాలనీ ఫేస్ -2, గ్రామంలో ప్రజా దీవెన యాత్రకు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కొత్త కొత్త వాగ్దానాలతో సరికొత్త ఎత్తుగడలతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వస్తోందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించారు. హుజురాబాద్ ఉపఎన్నిక ఎత్తుగడగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఎంత మేరకు విజయవంతం అయిందని ఖండించారు. మోసం చేసి సెంటిమెంట్ తో గెలవడమే బీఆర్ఎస్ విధానమని ఆరోపించారు.
ఎరువులు పూర్తి ఉచితంగా ఇస్తామంటూ గతంలో ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకో లేదన్నారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, నిరుద్యోగ భృతి వంటి హామీలు గాలికి కొట్టుకుపోయాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ - రాజేశ్వర రావు, వర్ధన్నపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, కురాకుల భారతి, డివిజన్ అధ్యక్షుడు అడిగోపుల సాంబేశ్వర్, డివిజన్ సీనియర్ నాయకుడు అడుప మహేష్, ఎస్కే జావేద్, పత్తి కుమార్, సౌరం చిన్ని అభిలాష్, కమలాకర్, గంగారపు బాబు, రాణి, సత్యంతో పాటు నాయకులు, గ్రామస్థాయి నాయకులు, మహిళా నాయకులు, యూత్ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు, ఎస్టీ సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు, మైనార్టీ సెల్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.