- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాలకుర్తి సీఐ కారుకు ఘోర ప్రమాదం.. దంపతులకు తీవ్ర గాయాలు
దిశ, పాలకుర్తి/తొర్రూరు: జనగామ జిల్లా పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి దంపతులకు కారు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివారం సూర్యాపేటకు చెందిన తన బంధువుల ఇంట్లో ఫంక్షన్ వెళ్లి వారు.. రాత్రి పాలకుర్తికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అర్వపల్లి మండలం అదివేముల గ్రామం వద్ద కారు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి.. మరో కారు ఎదురుగా రావడంతో అదుపు తప్పి పక్కన అన్న హోటల్‌లోకి దూసుకుపోయింది. సీఐ మహేందర్ రెడ్డి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మహేందర్ రెడ్డి దంపతులను హుటాహుటిన హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి
పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి దంపతులకు కారు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలియగానే మేము సంఘటన స్థలానికి చేరుకొని మహేందర్ రెడ్డి దంపతులను హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. సీఐ మహేందర్ రెడ్డి కి ఎడమ భుజం విరిగిపోయింది. పక్కటెముకలు విరిగిపోయాయి. మహేందర్ రెడ్డి సతీమణికి నడుముకు బాగా దెబ్బలు తాకాయని.. వర్దన్నపేట ఏసీపీ ఏ నర్సయ్య తెలిపారు.