Collector:మెడికల్ కళాశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి

by Kalyani |
Collector:మెడికల్ కళాశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి
X

దిశ, ములుగు ప్రతినిధి: నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం జిల్లా కేంద్రం లో నూతన మెడికల్ కళాశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర(Collector Diwakara )సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముందుగా మెడికల్ కళాశాల లోని క్లాస్ రూమ్స్, లెక్చర్ హాల్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ రూమ్, లైబ్రరీ, ల్యాబ్, హాస్టల్, మెస్, టాయిలెట్స్ లలో జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలో తరగతులకు కావలసిన, అవసరమైన వసతి సౌకర్యం సమకూర్చాలని కలెక్టర్ సూచించారు. ఒకసారి కళాశాల తరగతులు ప్రారంభించిన తర్వాత మళ్లీ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని ఆయన తెలిపారు. తరగతుల కు సరిపడా ఫర్నిచర్ వచ్చిందా? ఇంకా ఏమైనా అవసరం ఉంటే సమకూర్చాలని, ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. నర్సింగ్ కళాశాలకు కావలసిన మొదటి బ్యాచ్ కు 2 రూములు, ల్యాబ్స్ పార్టిషన్ ఏర్పాటు చేయాలన్నారు. కలశాల ఏ, బీ, సీ బ్లాకులలో అన్ని పనులు 10 రోజుల్లో అప్పగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీ.జీ.ఎం.ఐ.డీ.సీ ఈ ఈ ప్రసాద్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ లాల్, డీ ఈ రాజశేఖర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుధా రాణి, వైస్ ప్రిన్సిపాల్ రాజమణి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed