- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబి కండువా కప్పుకున్న'కర్రు '..
దిశ, కాటారం : మంథని నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం మారనుంది. సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీలలో బడా నాయకులు చేరికలు జరుగుతున్నాయి. మంథని నియోజకవర్గంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కొన్ని నెలలుగా పార్టీల కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సమాజసేవలో పనిచేస్తున్న బీసీ నేత కర్రు నాగయ్య గులాబి కండువా కప్పుకొన్నారు. కాటారం మండలంలోని ఓడిపిలవంచ గ్రామానికి చెందిన కర్రు నాగయ్య వ్యాపారం చేస్తూ మొదటగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత గత ఎన్నికలలో కాంగ్రెస్ లో చేరి మాజీమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు మద్దతు పలికారు. కొన్ని నెలలుగా రాజకీయ పార్టీల కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పార్టీలకతీతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
మంథని నియోజకవర్గంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కమాన్పూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. కర్రు నాగయ్యకు బీఆర్ఎస్ కండువా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బీసీ నేతగా పేరొందిన కర్రు నాగయ్య పెద్ద పెళ్లి జెడ్పీ చైర్మన్ మంథని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి పుట్ట మధును ఇటీవల మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ లో చేరిక విషయమై ఇరువురు చర్చించారు. పుట్ట మధు గ్రీన్ సిగ్నల్ తో శుక్రవారం పార్టీ ఆత్మీయ కార్యకర్తల సమావేశంలో కర్రు నాగయ్య బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. కర్రు నాగయ్య చేరికతో టీఆర్ఎస్ లో బీసీల మద్దతు పెరిగినట్లు అవుతుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా ఇంచార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.