- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మూగ జీవాలు మాయం.. లబోదిబోమంటున్న బాధితులు
దిశ, నర్సంపేట: నర్సంపేటలో రోజు రోజుకూ మూగ జీవాలు మాయం అవుతున్నాయి. ముఠాగా ఏర్పడిన కొందరు గుట్టు చప్పుడు కాకుండా నర్సంపేట పట్టణంలోని మూగ జీవాలైన గేదెలు, ఆవులను దొంగతనంగా ఎత్తుకెళ్తున్నారు. ప్రేమగా సాకుతున్న మూగ జీవాలు అపహరణకు గురవుతుండటంతో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాలైన గేదెలు, ఆవులు, ఎద్దులే టార్గెట్ గా ముఠా సభ్యులు పథకం ప్రకారం పగటి పూట రెక్కీ నిర్వహించి మరీ దొంగిలిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో గేదెలు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. నర్సంపేట పట్టణంలోని పలు కాలనీల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్కటిగా కాజేస్తున్న ముఠా సభ్యులు వీటిని వేరే చోటుకి తరలిస్తున్నారా.. లేక స్థానికంగానే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారా? అన్న చర్చ పట్టణంలో జరుగుతోంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన సంఘటన ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
నర్సంపేట పట్టణంలోని సర్వాపురం 5వార్డులో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బయట కట్టేసిన గేదెలను దొంగతనం చేసేందుకు ప్రయత్నం చేశారు. సదరు బాధితుడి ఇంటి నుంచి కొద్ది దూరం తరలించారు. అనుకోకుండా తీసుకెళ్తుండగా ఎదో శబ్దం రావడంతో స్థానికులు వారిని వెంబడించారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు ఆటోలో పారిపోయినట్లు తెలుస్తోంది. ఒక మహిళ స్థానికులకు పట్టుబడింది. అప్పటికే మూగ జీవాలు మాయం చేస్తున్నారన్న ఆగ్రహంలో ఉన్న స్థానికులు సదరు మహిళను స్థంభానికి కట్టేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ విషయం కాస్త పట్టణంలో ప్రచారం కావడంతో మూగ జీవాలను ఇప్పటికే కోల్పోయిన బాధితులు తమకు జరిగిన నMutts perished in Narsampetష్టాన్ని బహిరంగంగానే చర్చిస్తున్నారు. కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. వీరిని విచారించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.