- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే మురళి నాయక్
దిశ, కేసముద్రం : మండల కేంద్రంలోని పెనుగుండ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మురళీ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని తెలిపారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, రైతుల బాగు కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని, వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తుందని తెలిపారు. ఇక భారతదేశానికి ఆనాడు రైతులకు లక్ష రుణమాఫీ, నేడు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానీదే అని, దేశానికే అన్నం పెట్టే రైతన్నలు ఉన్నారు. కాబట్టే ధాన్యగారంగా తెలంగాణ మారుతుందని తెలిపారు.
ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవ్వరూ దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని అధికారులు త్వరగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎవరైనా మోసాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, సొసైటీ చైర్మన్ మర్రి రంగారావు, డీసీసీ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, డైరెక్టర్లు, గ్రామ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, ముదిగిరి సాంబయ్య, ఎంపీటీసీలు, వార్డ్ నెంబర్లు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.