Mahesh Kumar Goud : బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయింది : మహేష్ కుమార్ గౌడ్

by M.Rajitha |
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయింది : మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud)... బీఆర్ఎస్(BRS) పార్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 19న వరంగల్ లో నిర్వహించే విజయోత్సవ సభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ పార్టీ అగ్రనేత కేసీఆర్(KCR) ఇన్ని నెలలు గడిచినా ఫామ్ హౌస్ దాటి బయటికి రావడం లేదు.. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు గనుకే ఆయన బయటికి రావడం లేదని ఎద్దేవా చేశారు. మరో నాయకురాలు కవిత(Kavitha) లిక్కర్ స్కాంలో అడ్డంగా దొరికిపోయి, జైలుకు వెళ్ళి వచ్చింది.. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫార్ములా కార్ రేసు స్కాంలో త్వరలోనే జైలుకు వెళ్తారని.. ఇలా ఆ పార్టీలో నేతలు ఎవరూ కనిపించకుండా పోతారని అన్నారు. ఇప్పటికే ఆ పార్టీ మీద ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని, ఇక ఆ నేతలు తట్టా బుట్టా సర్దుకోవడమే మిగిలింది అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవడం తథ్యం అని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

Advertisement

Next Story