- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి..YSRTP రాష్ట్ర కోఆర్డినేటర్
దిశ, ములుగు : ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ అన్న తిరుపతి కోరారు. భారత రాజ్యాంగం దృఢమైనదని, లిఖితపూర్వకంగా వ్రాయబడినదని, అంతటి గొప్ప రాజ్యాంగాన్ని అవమానపరిస్తే ఎవరినైనా శిక్షించాల్సిందే అని తిరుపతి అన్నారు. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ పలు దేశాల రాజ్యాంగాలు చదివి రాశారని, ఒక రాజ్యంగం అంటే ఎలా ఉండాలో తెలిపిన మహనీయుడు అంబేద్కర్ అని వారు అన్నారు. ఆయన రాసిన రాజ్యంగాన్ని కాపాడాల్సిన బాధ్యత వ్యవస్థపై ఉన్నదని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ తిరుపతి అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఎన్నో దేశాలు మెచ్చుకుంటున్నాయని, రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించిన మహా వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన పేర్కొన్నారు.
అటువంటి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన కెసిఆర్‌పై దేశ ద్రోహం కేసు పెట్టాల్సిందే అని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వ్యక్తులనైనా శిక్షించాల్సిందే అని వైయస్సార్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగం తరపున డిమాండ్ చేస్తున్నామని తిరుపతి అన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సారి చదువుకోవాలని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం గొప్పతనం తెలియని కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు అబ్బాస్ అలీ, కొండబోయిన దిలీప్, మర్రి మధు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.