- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనగామ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : కొమ్మూరి
దిశ, నర్మెట్ట : మండలంలోని శనివారం రోజున పలుగ్రామాలలో జనగామ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు. కన్నెబోయిన గూడెం, అమ్మాపురం, వెల్దండ, ఆగపేట, ఇప్పలగడ్డ, గుంటూరుపల్లి, నర్మేటలో ప్రచారం నిర్వహించి, జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ తోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. జనగామ నియోజకవర్గంలో గండిరామవరం, తపాసుపల్లి, వెల్డండ గ్రామాలకు రిజర్వాయర్లు నీళ్లు తీసుసుకొచ్చింది నేనే, కేసీఆర్ నీళ్లు వేరే చోటుకు మల్లించాలని ప్రయత్నం చేస్తే అడ్డుకున్నది నేనే, ఆ కక్ష్యతోనే నన్ను పార్టీ నుండి తీసేసారు అలాంటి మోసగాడు కేసీఆర్ అని అన్నారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మోసాలు, అరాచకాలు, దౌర్జన్యాలు తప్ప ప్రజలకు మంచి జరిగిందేమి లేదని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 6 గ్యారంటీ పథకాలతో ముందుకు వస్తుంది. జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. చేర్యాల, నర్మటతో పాటు ఇతర మండలాలలో నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అభివృద్ధి మాత్రమే ఉంది. మరొకసారి నన్నుఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే జనగామ నియోజకవర్గాన్ని అందంగా తీర్చిదిద్దానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గంగం నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం, వెంక నరసింహారెడ్డి, కుమారస్వామి, కళ్యాణ మురళి, నక్కల గట్టయ్య, దేవులపల్లి భాగ్యలక్ష్మి, భూపతిరెడ్డి, చెవుల పరశురాములు, బండి అశోక్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.