- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం..
దిశ, జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణంలో నిర్వహించారు. మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ బాల్దే సిద్ధిలింగం, వైస్ చైర్మన్ మున్సిపట్ల విజయకుమార్ సహా పాలక వర్గంలోని మరో 12 మంది డైరెక్టర్లు మాల రాజు, శివరాత్రి రాజ్ కుమార్, నూనె ముంతల యాకస్వామి, బసవ గాని బాల మల్లేష్, చేవెళ్లి మధుసూదన్, గవ్వల రవి, ముసి గుంపుల ఆంజనేయులు, ధర్మ జయప్రకాశ్ రెడ్డి, అజ్మీర మంగమ్మ, సుదగాని సంజీవ, మా శెట్టి వెంకటేశ్వర్లు, మా శెట్టి అశోక్ లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య తదితరులు హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుడికి చైర్మన్ అవకాశం కల్పించారని అన్నారు. కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి జనగామ మార్కెట్ యార్డును తెలంగాణలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ పాలకమండలి విజయవంతంగా సేవలందించి రైతుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతన పాలకవర్గం చైర్మన్, డైరెక్టర్ లందరికీ ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.