primary schools : పాఠశాల నిర్మాణానాలకు మోక్షం ఎప్పుడో ?

by Sumithra |
primary schools : పాఠశాల నిర్మాణానాలకు మోక్షం ఎప్పుడో ?
X

దిశ, భీమదేవరపల్లి : తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఈ కమిటీలలో మహిళా స్వయం సహాయక సంఘాల సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను అమలు చేయడం, పర్యవేక్షించడం, బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు పాఠశాల యూనిఫామ్ లను ఇవ్వడం మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య పనుల గురించి చూసుకోవడం అమ్మ ఆదర్శ కమిటీలది బాధ్యత. ఈ బాధ్యతలో భాగంగా ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, బాలికల మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు కల్పించడం, చిన్న పెద్ద మరమ్మతు పనులు పూర్తి చెయ్యడం, తరగతి గదులు, విద్యుత్ , పాఠశాల ప్రాంగణంలో పారిశుద్ధ్యం నిర్వహణ, పనులను చేయించాలి.

అయితే వీటికి విరుద్ధంగా భీమదేవరపల్లి మండలంలో గల పిల్లల పాఠశాల అధ్వాన స్థితిలో చేరాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ నిర్వహణ స్వయం సహాయక సంఘాలు నీరుగార్చాయి. తూతూ మంత్రంగా మరమ్మత్తుల పనులను చేయించి గాలికి వదిలేశారు. ప్రభుత్వ బడులలో తమ పిల్లలను చదివించి ప్రయోజకులుగా చేయాలని ఆశయంతో గ్రామాల్లో నిరుపేదలు అనుకుంటున్నారు. అయితే ఈ నిరుపేదల ఆశయాలను ప్రభుత్వ ఉద్యోగులు నీరుగారుస్తున్నారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు సమయం కేటాయించి నిర్లక్ష్యం వహిస్తూ వెళ్ళిపోతున్నారు. పాఠశాల బాధ్యత పట్టింపు చర్యలు లేనట్టుగా చోద్యంగా వెళ్ళిపోతున్నారు. విద్యను బోధించకుండనే జీతాల కోసమే పని చేస్తున్నట్లు కొందరు ఆగ్రహిస్తున్నారు.

ప్రాథమిక పాఠశాలలో పూర్తికాని నిర్మాణాలు..

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పాఠశాలల పునర్నిర్మాణం కోసం అని చిన్నచిన్న మరమ్మత్తుల పనులను చేయించడానికి దాదాపు కొన్ని లక్షల రూపాయలను భీమదేవరపల్లి మండలానికి కేటాయించడం జరిగిందని సమాచారం. అయితే ఈ లక్షల రూపాయలను మండలంలోని కొన్ని గ్రామాలకు చెందిన పాఠశాలలకు కేటాయించి మరమ్మత్తు పనులను చేయించడానికి అనుమతిని ఇచ్చారు. అధికారుల పర్యవేక్షణ లోపం నిర్లక్ష్యం వల్ల ఈ నిర్మాణ పనులను పట్టించుకోకుండా వదిలేశారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన పాఠశాల భవనాల పని బేస్ మీట్ వరకు ఆగిపోయింది. సరైన సమయానికి బిల్లులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

పెచ్చులుడుతున్న భవనం గదులు..

ముల్కనూరులో కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన పిల్లల పాఠశాల భవనాల్లో పెచ్చులూడుతున్నాయి. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల పై ఈ పెచ్చులు ఏ క్షణాన పడుతుందో తమ తల పై ఎప్పుడు పడుతుంది అని భయం భయంతో పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. భవనాలకు తలుపులు సరిగా లేక ముఖ్యమైన వస్తువులు దాచుకునే పరిస్థితి దొంగలకు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఉన్న ఆ తలుపులు ఏ క్షణాన కూలిపోతాయి అని ఆ తలుపులను ముట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసించాలనే ఆలోచన వస్తే ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది.

ఏడాది క్రితం ట్రైనీ కలెక్టర్ పరిశీలించిన ఫలితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి కనబడుతోంది. భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు గ్రామంలో ఉన్న పిల్లల ప్రభుత్వ పాఠశాలలో అధ్వాన స్థితిలోకి చేరాయి. తమ పిల్లలను పాఠశాలలో చేర్పించి విద్యాబుద్ధులను నేర్పించాలని తల్లిదండ్రులు ఆశిస్తే వారి ఆశలు అడియాశలు అవుతున్నాయి. పాఠశాల నిర్మాణం సరిగా లేక పాఠశాలలో విద్యాబోధనలు చేసే ఉపాధ్యాయులు పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారాయి. ఈ విధంగా మారడానికి ప్రధానంగా గత పాలకుల నిర్లక్ష్యమే నిలువెత్తు నిదర్శనం అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed