- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరిప్రియకు ఓటుతో బుద్ధిచెప్పాలి : బాపనపల్లి సుందర్
దిశ, గార్ల : దళిత బంధు ఆశ చూపి దళితులను రెండు ఏళ్ళు పార్టీ కార్యక్రమాలకు వాడుకుని అవమానించిన ఎమ్మెల్యే హరిప్రియను దళితులు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బాపనపల్లి సుందర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అర్హులైన దళితులకు 12 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది అని అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ గార్ల మండల దళితులను ఎమ్మెల్యే హరిప్రియ, మండలంలోని ఆమె అనుచరులు బందుల పేరుతో 30 వేల నుంచి 2 లక్షల వరకు కమిషన్లు వసూలు చేసి నిరుపేద దళితులను అప్పులపాలు చేశారని.
రెండు ఏళ్లుగా దళిత బందు ఆశ చూపి దళితులను తమ పార్టీ కార్యకలాపాలకు, వాడుకుని జెండా మోయించుకుని, చెప్పులు అరిగేలా తిప్పించుకున్నారు. చివరకు మూడువేలు ఖర్చు పెట్టించి పార్టీ ప్లెక్షీలు కూడా కట్టించారు. దళితులను తన స్వార్థ రాజకీయం కొరకు ఇల్లందు క్యాంపు కార్యాలయం చుట్టూ కాళ్ళు కాయలు తేలేలా తిప్పుకుని చివరకు మొండి చేయి చూపించారు. దరఖాస్తు ఫారాలు ఇప్పటికి మండల కార్యాలయంలోనే ఉన్నాయన్నది వాస్తవం మండలంలోని అన్నికులాల వారికి కించ పరచిన హరిప్రియకు ప్రజలు ఓటుతో తగిన గుణపాఠం చెబుతారు. ఐదేళ్లలో గార్ల మండలంలోని ఎస్సీలకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు తీసుకురాలేదు. అరకొర ఇచ్చినా తన ముఖ్యఅనుచరులకు కట్టబెట్టారు. మండల ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య చేతి గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.