- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏరోజు చెల్లింపులు ఆ రోజే విధానానికి స్వస్తి..
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో రైతులు దగా చేయపడుతున్నారు. వ్యాపారులు మార్కెట్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి మార్కెట్ కు వ్యవసాయోత్పత్తులు విక్రయానికి తేగా, రైతుల అమాయకత్వంను ఆసరాగా చేసుకొని వ్యాపారులు మోసం చేస్తున్నారు. ఈ-నామ్ విధానం అమలులో ఉన్నప్పటికీ రైతులకు ఏరోజు పేమెంట్ ఆరోజు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ చేయకపోవడం పలుఅనుమానాలకు తావిస్తోంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం ఆలేరు గ్రామానికి చెందిన వీరన్న అనే రైతు ఈనెల 4వ తేదీన పత్తిని విక్రయానికి తెచ్చాడు. ఈ రైతుపత్తిని అన్లైన్ ట్రేడింగ్ విధానంలో విఘ్నేశ్వర ట్రేడింగ్ కంపెనీ క్వి.లకు ధర రూ .7500 చొప్పున దక్కించుకుంది. పది క్వింటాల యెనబై కిలోల పత్తికి ధర క్వి.7500ల చొప్పున రూ 80. 233 రాగ, వీటిలో అన్ని ఫీజుల కలిపి రూ.483 కటింగ్ పోగా మిగిలిన రూ.79,750 ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ. 4750 ఇచ్చి, రూ. 75,000 లకు చెక్కు ఇచ్చినట్లు రైతు తెలిపాడు.
ఈ నెల 4 వతారీకు సరుకు తెస్తే, 8వ తేదీ వేసి చెక్కు ఇవ్వగా, బ్యాంకులో 10 రోజుల తర్వాత జమచేయగా విఘ్నేశ్వర ట్రేడింగ్ కంపెనీ అకౌంట్ లో డబ్బులు లేవని, బౌన్స్ అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపినట్లు రైతు వాపోయాడు. సరుకు విక్రయించి సుమారు ఇరవై రోజుల గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో బాధిత రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరాక్ష్యరాసుల రైతుల పరిస్థితి ఏమిటీ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ జిల్లా నుండి మార్కెట్ కు విక్రయానికి వచ్చి, వ్యాపారులు రైతులకు ఇచ్చిన చెక్కుల బౌన్స్ అయితే ఎన్నిసార్లు తిరగాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నామ్ నియమ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. రైతులను మోసం చేస్తున్న ట్రేడింగ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విఘ్నేశ్వర ట్రేడింగ్ కంపెనీ లైసెన్స్ రద్దు చేసి, వ్యాపారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాధిత రైతు ఈ విషయం పై జిల్లా కలెక్టర్, మార్కెట్ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కమిషనర్ తనిఖీలు చేయకపోవడాం వల్లనే మార్కెట్లో, రైతులు వ్యాపారుల చేతుల్లో మోసపోతున్నట్లు వాపోతున్నారు.