- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐకేపీ సెంటర్లో రైతు ఆత్మహత్యాయత్నం..
దిశ, జనగామ : ఐకేపీ సెంటర్లో వారం రోజులుగా ధాన్యం పోసి పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పూనుకున్న ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్టేషన్గన్పూర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అదే గ్రామానికి చెందిన కమాన్ల వెంకటయ్య అనే రైతు వారం రోజుల క్రితం ఈ సెంటర్ కు ధాన్యాన్ని తీసుకువచ్చాడు. ధాన్యానికి, గన్ని బ్యాగులు ఇవ్వడం మొదలుకుంటే కాంటా పెట్టడం వరకు అడుగడుగునా ఐకేపీ నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓపిక నశించి గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ధాన్యాన్ని తగలబెట్టి రైతులు నిరసన తెలిపారు.
రైతులందరూ నిరసన కార్యక్రమంలో మునిగిపోయి ఉండగా వెంకటయ్య అనే రైతు పురుగుల మందు డబ్బాతో పక్కకు వెళ్లి ఆ మందు తాగి ఆత్మహత్య యత్నానికి పూనుకున్నాడు. గుర్తించిన తోటి రైతులు వెంటనే అడ్డుకున్నారు. అనంతరం అతనికి నచ్చ చెప్పారు. దీంతో అతని ప్రాణానికి ఎలాంటి అపాయం జరగలేదు. ఇదిలా ఉంటే అధికారులు చెబుతున్నదానికి క్షేత్రస్థాయిలో ఐకెపి నిర్వాహకులు, మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరుకు పూర్తి భిన్నంగా ఉందని బాధిత రైతు వెంకటయ్య వాపోయాడు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బంది, బాధాకరమని, దీన్ని అధికారులు గుర్తించనంతవరకు రైతులకు ఇబ్బందులు తప్పవని ఆయన వాపోయాడు. అదేవిధంగా రైతులునిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా ఐకెపి వారిని శాంతింపచేశారు.