- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేట్ కు ధీటుగా గురుకులాల్లో అద్భుతమైన ఫలితాలు : మంత్రి సత్యవతి రాథోడ్
దిశ, రేగొండ (గణపురం) : భూపాలపల్లి జిల్లాలోని 19 గ్రామాల పరిథిలో హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు 8 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి పర్యటించి పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు సీఎస్ఆర్ నిధుల ద్వారా భూపాలపల్లి మండలం కమలాపూర్ లో సమగ్ర గ్రామీణ అభివృద్ధి కింద చేపట్టిన కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు.
కమలాపూర్ గ్రామంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను మంత్రి పరిశీలించారు. అనంతరం భూపాలపల్లి పట్టణంలో 66 లక్షల వ్యయంతో నిర్మించిన సఖీ సెంటర్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. సఖీ సెంటర్ ద్వారా జిల్లాలో అందుతున్న సేవలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూపాలపల్లిలో 25 లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన అంబులెన్స్ సర్వీసు మంత్రి ప్రారంభించి, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దీని పూర్తి స్థాయిలో వినియోగించాలని మంత్రి సూచించారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల కేంద్రంలో సఖీ సెంటర్ భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన 60 లక్షలకు అదనంగా మరో ఆరు లక్షలు కలెక్టర్ నిధులను కేటాయించి అద్భుతమైన సఖి కేంద్రం భవనాన్ని నిర్మించారని మంత్రి ప్రశంసించారు.
హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు వారు గత సంవత్సరం కోటి రూపాయల వ్యయంతో పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేశారని, ప్రస్తుత సంవత్సరం మరో ఏడు కోట్లు ఖర్చు చేస్తూ సమగ్ర గ్రామీణ అభివృద్ధి కింద 19 గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నారని, సీఎస్ఆర్ కింద భూపాలపల్లి జిల్లాలో కార్యక్రమాలు చేపట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాలుగా సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, మహిళలకు గర్భం సమయంలో పౌష్టికాహారం అందించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో ఇకపై పిల్లలకు, మహిళలకు, బాలింతలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం ఆరోగ్య లక్ష్మి పథకం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని, పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఇంటర్ పదవ తరగతి పరీక్షలలో ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, జిల్లాలోని 49 ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఈ సంవత్సరం 5వ స్థానంలో నిలిచారని, ప్రత్యేక తరగతుల నిర్వహణ కోసం 10వ తరగతి విద్యార్థులకు ఉదయం రాగిజావతో అల్పాహారం అందించమని తెలిపారు.
ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి సర్కారు బడిలో ఉదయం పిల్లలకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం కింద భూపాలపల్లి జిల్లాలో 19 గ్రామాలలో వివిధ కార్యక్రమాలు చేపట్టామని, నీటి లభ్యతను పెంచడం, మొక్కల పెంపకం, పచ్చదన పెంపకం, విద్యాభివృద్ధి సమగ్ర వ్యవసాయ విధానం మొదలైన లక్ష్యాలతో పలు కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. 3 సంవత్సరాల పాటు సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, 2022-23 సంవత్సరంలో దీని కింద 19 గ్రామాల పరిధిలో 152 సోలార్ వీధి దీపాలు, 300 మత్స్యకారులకు ఫిషింగ్ కిట్, 12 చేపల బోట్, 32 ఈత చెట్ల ఎక్కే యూనిట్ల, 83, 333 చేపపిల్లలు, 6 స్మార్ట్ డిజిటల్ క్లాసులు, 9 మినీ లైబ్రరీలు, 9 పాఠశాలల్లో టాయిలెట్ బ్లాక్, 9 పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం ఇతర వసతుల కల్పన, 330 హోం గార్డెన్ ఏర్పాటు, 19 రైతుల క్లబ్ ఏర్పాటు, 248 సాయిల్ హెల్త్ కార్డుల జారీ, 7 పాడే పరిశ్రమ శిక్షణ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు.
వచ్చే 2 సంవత్సరాల కాలంలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం కింద 7 కోట్ల వ్యయం వివిధ కార్యక్రమాల అమలుకు ప్రణాళికలు తయారు చేశామని కలెక్టర్ తెలిపారు. కమలపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అఖిలాండేశ్వరి పదవ తరగతి పరీక్షలో 9.5 మార్కులతో ఉత్తీర్ణత సాదించినందుకుగాను మంత్రి, ఎంఎల్ఏ, కలెక్టర్ లు శాలువతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కుల శ్రీహర్షిణీ, అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.