- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Etala Rajender : హైడ్రా అనే కొత్త డ్రామా తెరకెక్కించారు
దిశ,కమలాపూర్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన చాలా రోజుల తర్వాత నియోజకవర్గానికి వచ్చిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు మండల కేంద్రంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల ముందు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చకుండా ప్రగల్భాలు పలికి ఇప్పుడు హైడ్రా పేరిట కొత్త డ్రామాలాడుతున్నారని ముఖ్యమంత్రి పై మండిపడ్డారు. అధికారులను, మంత్రులను గ్రామాలకు పంపి విచారణ జరిపించి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఉమ్మడి కుటుంబం తో పాటు ఏర్పడిన కుటుంబాలకు కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్లను ఇవ్వడమే కాకుండా కొత్త వారికి కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఈటెల డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చే రైతుబంధు సరిపోదని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.15 వేలు ఇస్తానని ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో వర్షాకాలపు రైతుబంధు రైతులకు అందించలేదని మండిపడ్డారు. గ్రామాల్లో రైతు రుణమాఫీ పై చర్చ జరగకుండా హైడ్రా అనే కొత్త డ్రామాకు రేవంత్ రెడ్డి తేరే లేపారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లో గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టిన దళిత బంధు పథకం కు అర్హులైన లబ్ధిదారులకు రెండో విడత దళిత బంధు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి మొదలు కానున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చిన్న,పెద్ద, హోదాలతో సంబంధం లేకుండా సభ్యత్వ కార్యక్రమంను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు ఈటల పిలుపునిచ్చారు.