తెలంగాణ యువసంగం విద్యార్థుల ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యాత్ర విజయవంతం..

by Sumithra |
తెలంగాణ యువసంగం విద్యార్థుల ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యాత్ర విజయవంతం..
X

దిశ, కేయూ క్యాంపస్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" లో భాగమైన యువ సంఘం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విద్యార్థుల బృందం ఉత్తరాఖండ్ కు సందర్శించారు. ఈ యువ సంఘం కార్యక్రమానికి తెలంగాణ నుండి ఎన్ఐటి వరంగల్ నోడల్ ఇన్స్టిట్యూట్ గా వ్యవహరించి, 45ని సెలెక్ట్ చేశారు. కాగా ఈ బృందంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బిజినెస్, ఫార్మసీ, నెహ్రూ యువకేంద్ర, ఈ కామర్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ కు చెందిన ఐఐటీ రూర్కీ ఈ కార్యక్రమానికి నోడల్ ఇన్స్టిట్యూట్ గా వ్యవహరించి మన తెలంగాణ విద్యార్థులకు ఆతిథ్యం అందించారు. ఈ బృందం ఐఐటీ రూర్కీలోని అంబుజా సిమెంట్స్, ఎవరెస్టు సిమెంట్స్, స్టీల్ ఇండస్ట్రీస్ ను సందర్శించారు. అక్కడి ఇండస్ట్రీల్లో జరిగే ప్రాసెసింగ్ విశేషాలను గూర్చి తెలుసుకున్నారు.

నైనిటాల్లోని ఆర్యభట్ట రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ఏరిస్) లోని వివిధ రకాలైన టెలిస్కోప్లను గూర్చి అక్కడి సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బెల్ది సాలహాపూర్ గ్రామంలోని వ్యవసాయ పనులను స్థితిగతులను అభివృద్ధిని గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మన తెలంగాణ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర జానపద, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా పేరిణి లాస్యం బతుకమ్మఆట, బోనాలు పండుగ నృత్యాలను మన విద్యార్థులు ప్రదర్శించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జేశారు. పాల్గొన్న డెలిగేట్లు గవర్నమెంట్ అఫ్ ఇండియాను, నిట్ వరంగల్ ని అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed