- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధాన్యం బోనస్ విషయంలో అపోహలొద్దు: కలెక్టర్ ప్రావీణ్య
దిశ,ఎల్కతుర్తి: సన్న రకం ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ విషయంలో ఎలాంటి అపోహలొద్దని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద డిఆర్డిఏ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. వరి కోతలు, ధాన్యం గురించి స్థానిక రైతులతో ఆమె మాట్లాడారు. ఆరబోసిన ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం గురించిన వివరాలతో పాటు సుమారుగా ఎంత ధాన్యం రానుందనే వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వాతావరణ వివరాలను రైతులకు తెలియజేస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసు కున్నారు. రైతులు సన్న రకం ధాన్యం బోనస్ అంశాన్ని గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా దీనిపై కలెక్టర్ వివరణ ఇచ్చారు.
అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ కొనుగోలు కేంద్రానికి ఎక్కువ శాతం సన్న రకం ధాన్యం వస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన 8 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 154 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా వందకు పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టినట్లు చెప్పారు. పెద్ద కేంద్రాలలో డ్రయ్యర్లను కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వీటిని అందుబాటులోకి తీసుకు రావడం వలన నిబంధనల మేరకు తేమ రావడానికి అవకాశం ఉందన్నారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ రూ. 500 లు ఓపీఎంఎస్ ట్యాబ్ ఎంట్రీ అయిన వెంటనే సంబంధిత రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని వివరించారు. సన్న రకం ధాన్యానికి సంబంధించిన బోనస్ విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు పోవద్దన్నారు. డిఆర్డిఓ నాగ పద్మజ, తహసీల్దార్ జగత్ సింగ్, వ్యవసాయ, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.